vij72 Profile Banner
Prof VJR Profile
Prof VJR

@vij72

Followers
1K
Following
35K
Media
978
Statuses
15K

A committed human for bringing change in the society.Difference of opinion is respected.RT s not endorsements.

Joined July 2010
Don't wanna be here? Send us removal request.
@vij72
Prof VJR
7 years
ఇక్కడ👇చెప్పినట్టుగా ఎన్నికల తర్వాత నాయకులందరూ100శాతం నమ్మేంత మంచివాళ్ళూ కారూ, అలానే ఎన్నికలముందు ప్రజలు నమ్మలేనంత చెడ్డవారూ కారని మన ఘనప్రజాస్వామ్యం ప్రతి ఎన్నికల సందర్భంలో నిరూపిస్తూనే వస్తున్నది.ఇద్దరూ తమ తమ అవసరార్థం మారుతూ ప్రజాస్వామ్యాన్ని వెంటిలేటర్ మీదబ్రతికిస్తున్నారంతే!
0
3
9
@vij72
Prof VJR
4 days
అన్యాపదేశంగా రైతుల పట్ల సహానుభూతి చూపుతూ వారి ఈతిబాధలను తేలిగ్గా తీసుకునేవారికి కనువిప్పు కలిగించే వాక్యాలతో👇 ‘4రోజులు పెంచిన 4మొక్కలు చచ్చిపోతేనే నాకింత బాధగా ఉందే.మరి 4నెలలు పెంచి పోషించిన పంట నాశనం అయిపోతే రైతుల గుండెలు ఆగిపోయాయంటే ఆశ్చర్యం లేదు’ మొట్టిక్కాయలు వేసారు.👌👏😎
@ArunBee
Arunn Bhagavathula చి లిపి
4 days
ఈ మధ్య గబుక్కున ఒక ఆలోచన వచ్చింది. అదేమిటంటే నన్నెవరైనా హటాత్తుగా "ఈ దేశం నీకేమిచ్చిందన్నది కాదు పాయింట్! నువ్వు దేశానికి ఏమిచ్చావు అన్నదే ప్రశ్న" అని పదిమందిలో అడిగారనుకోండి. అప్పుడు నా గతేమిటి? ఎంత ఆలోచించినా ఈ దేశానికి ఏమిచ్చానో తట్టలేదు. ఆదాయపు పన్నంటారా? అది నేను
0
0
2
@vij72
Prof VJR
8 days
అర్హత అనర్హత విషయాన్ని పక్కనబెడితే సరిగ్గా #ఎన్నికలసంధ్యారాగం ముంగిట #పద్మాలు వికసించేలా ప్రకటనలు రావడం మాత్రం జగమెరిగిన సత్యం😳😇🤔
@Vengalams
వెంగళం
8 days
కొంతమంది అనర్హులేమోగానీ.. మరికొంతమంది మాత్రం నూరుశాతం అర్హులు! వారి సేవలు చిరస్మరణీయం, భావితరాలకు స్ఫూర్తిదాయకం..🙏 #పద్మాలు
1
0
2
@vij72
Prof VJR
10 days
మొదటిసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికైనప్పటికీ బాధ్యతతో కేంద్రమంత్రిగా పరుషపదాలు వాడకుండా అపార్థాలకు తావివ్వక సామాన్యులకు కూడా అర్థమయ్యేలా ఏపీ భూసర్వే పాసుపుస్తకాల వితరణ గూర్చి చక్కగా వివరించడం చూసి ఆయన అవగాహనను సమస్యల పరిష్కారానికి చేసే ప్రయత్నాలను తప్పక అభినందించాల్సిందే👌👏💐
@PemmasaniOnX
Dr. Chandra Sekhar Pemmasani
10 days
జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు పూర్తి నిజాలు చెప్పడం లేదు. ల్యాండ్ సర్వే - రీ సర్వే, పాస్ పుస్తకాలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై జగన్ గారు పూర్తి వాస్తవాలు చెప్పలేదు. ఆ నిజాలు ఏమిటనేవి ప్రజలకు నేను పూర్తిగా తెలియాలని నేను చెబుతున్నాను. సర్వే–రిసర్వే అనేది కేంద్ర ప్రభుత్వ
0
0
0
@vij72
Prof VJR
10 days
పన్నుమీది పన్నుతో నవ్వితే అందమని మీ భావన…😳🤔 పన్నుమీది పన్ను పీకితే అందమని #దంతిష్టు భావనేమో…😂🤣
@Ksravishankar2
కన్నేపల్లి✨ సరస #sarc Textrovert.
10 days
పన్ను మీద పన్ను వస్తే నవ్వుతే అందంగా ఉంటారని, అదృష్టం అని విన్నాం, ఆ డాక్టరు తీసేస్తా అంటాడేంటి?
1
0
3
@vij72
Prof VJR
11 days
ధనమూలమిదం జగత్ అన్నా… డబ్బుకు లోకం దాసోహం అన్నా… పైసా మే పరమాత్మ అన్నా… అందరికీ కావాల్సిందీ అందరినీ నడిపించేది అందరినీ నవ్వించేది అందరినీ ఏడిపించేది కూడా డబ్బే అని ఆయన ఘంటాపథంగా చెబుతున్న మాట అక్షరసత్యం ఉంటే అభయం 💪 లేకుంటే భయం 😭 #డబ్బు
@nirupamakotekar
Nirupama Kotekar
12 days
Chala correct chepparu.. especially last line🙏🙏
0
1
2
@vij72
Prof VJR
12 days
సంప్రదాయాల పేరుతో కొందరు చేసే అతి వ్యవహారాలను ఆరోగ్యవంతమైన హాస్యంతో మేళవించి పాత్రోచిత సంభాషణల ద్వారా చురకలంటిస్తూ #కళాతపస్వి చూపెట్టిన మంచి సన్నివేశం.👏👌✨ #స్వర్ణకమలం #సాక్షిరంగారావు #శ్రీలక్ష్మీ
@mana_Brahmi
బ్రహ్మీ 💛
14 days
కె విశ్వనాథ్ గారు అంటే మొట్ట మొదట గుర్తుకొచ్చే సన్నివేశం స్వర్ణకమలం సినిమా నుండి.. #SriLakshmi #SakshiRangaRao
1
2
6
@vij72
Prof VJR
15 days
#శ్రీకనకమాలక్ష్మీరికార్డింగ్_డాన్స్_ట్రూప్ 👍👌👏 అచ్చమైన గోదారిమాండలికపు సొబ���ులతో వేర్వేరు పాత్రలను వింతైన మ్యానరిజాలతో తీర్చిదిద్ది ఆద్యంతం పసందైన వినోదాన్ని అందించిన #వంశీ మార్కు సినిమా.👌👏😍✨
@mana_Brahmi
బ్రహ్మీ 💛
16 days
ఇలాంటి సీన్ ఒక్క వంశీ గారికే కుదురుతుంది.. తెలుగు సినిమాకి సహజత్వం పరిచయం చేసిన దర్శకుడు… దానికి మంచి నటులు తోడైతే 🔥 #Vamsy #KotaSrinivasRao @TanikellaBharni @ItsActorNaresh
0
0
2
@vij72
Prof VJR
15 days
మీ జీవితంలో ఈ ఏడాది అమోఘమైన విజయాలను అందించే ఏడాది కావాలని ఆశిస్తూ మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. 💐🍫🧁 @srizzler
0
0
1
@vij72
Prof VJR
16 days
ఓహోహో….ఇప్పడర్థమైంది..😳🤔 పండక్కి వారం ముందే గోదారి ముంగిట క్కోక్కో…బరుల్లో బాగా లాభాలట్టించుకుని మల్టీఅసెట్ఫండింగిన్వెస్ట్మెంటులో పెట్టుబడిలెట్టేసి ఇప్పుడిట్టా తీరిగ్గా ఏవండోయ్ ఎలాగున్నారని పరాచికాలన్నమాట..😳🤔 ఏవైనా మీ లెవిలే యేరండి బాబో😀🤣 #రావురమేష్ వాయిస్లో వినాలిమరి😂
@Vengalams
వెంగళం
16 days
@Chandu1302 బాగున్నారా? అని అడగడంలో ఇంత అర్థం ఉందా…😲 😳😵‍💫 బావున్నా గురుగారూ 🤗🤗 ప్రేమ ఆప్యాయత పనిష్మెంట్ అన్నీ ఒకేదాంట్లో! #మల్టీ_ఎసెట్_ఫండ్
1
0
1
@vij72
Prof VJR
17 days
ఒకవేళ…. కొక్కో….బరులవైపు వెళ్ళకపోయుంటే ….😳🤔 #సంక్రాంతిసంబరం🌾💥
@sunkaraleela
లీల కృష్ణ సుంకర 4.O
17 days
Before After Sankranthi
1
0
1
@vij72
Prof VJR
17 days
ఆలోచింపజేసే విశ్లేషణ.కాని స్వల్పకాల ప్రయోజనాలవేటలో పరుగులెడుతున్న ప్రస్తుత సమాజం మరియు ప్రజలు దీర్ఘకాల గ్రామీణపునరుత్తేజమే నిజమైన ఆర్థికాభివృద్ధికి కొలమానం అని గ్రహించినపుడే నిజమైన #గ్రామస్వావలంబన సాధ్యం అవుతుంది. ఇకనైనా ప్రజాభాగస్వామ్యంతో ప్రభుత్వాలోచనలు ఈ దిశలో మొదలైతేమంచిది👍
@RameshPV2010
Dr PV Ramesh
17 days
వరి కోతల పండుగ అయిన సంక్రాంతిని జరుపుకుంటున్న తరుణంలో, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్క క్షణం ఆగి, ఒక ముఖ్యమైన వాస్తవం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అనేక దశాబ్దాలుగా, ఆంధ్రప్రదేశ్ వరి సాగులో భారతదేశంలో అగ్రగామి రాష్ట్రాలలో ఒకటిగా ఉండేది - సాగు విస్తీర్ణం, ఉత్పాదకత, రైతుల నైపుణ్యం
0
1
0
@vij72
Prof VJR
17 days
ఆలోచింపజేసే విశ్లేషణ.కాని స్వల్పకాల ప్రయోజనాలవేటలో పరుగులెడుతున్న ప్రస్తుత సమాజం మరియు ప్రజలు దీర్ఘకాల గ్రామీణపునరుత్తేజమే నిజమైన ఆర్థికాభివృద్ధికి కొలమానం అని గ్రహించినపుడే నిజమైన #గ్రామస్వావలంబన సాధ్యం అవుతుంది. ఇకనైనా ప్రజాభాగస్వామ్యంతో ప్రభుత్వాలోచనలు ఈ దిశలో మొదలైతేమంచిది👍
@RameshPV2010
Dr PV Ramesh
17 days
వరి కోతల పండుగ అయిన సంక్రాంతిని జరుపుకుంటున్న తరుణంలో, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్క క్షణం ఆగి, ఒక ముఖ్యమైన వాస్తవం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అనేక దశాబ్దాలుగా, ఆంధ్రప్రదేశ్ వరి సాగులో భారతదేశంలో అగ్రగామి రాష్ట్రాలలో ఒకటిగా ఉండేది - సాగు విస్తీర్ణం, ఉత్పాదకత, రైతుల నైపుణ్యం
0
1
0
@vij72
Prof VJR
1 month
కాచి వడబోసిన జీవితసారాన్ని సరళమైన పదాల అల్లికలతో కూడిన తన సహజకవనంతో పదుగురు మెచ్చేలా సమాజానికందించిన సార్థకకవి #సిరివెన్నెల గారు,అంతే ఆర్తితో మార్దవంగా బాణీలుకట్టిన సంగీతదర్శకుడు #చక్రి గారు. వీరిద్దరి ప్రతిభను తెరమీద ఆవిష్కరించిన #కృష్ణవంశీ👌👏 వెరసి అద్భుతగీతం సంగీతం🎼🎹 #చక్రం
@atheisttindiann
ismailbhai
1 month
సిరి వెన్నెల గారు ఎప్పుడో రాసుకున్న పాట ని పట్టు బట్టి మరి చక్రం మూవీ లో పెట్టుకున్నారు అంట @director_kv గారు 🙏 క్లాసిక్ సాంగ్స్ లో ఇదొకటి చరిత్ర లో మిగిలిపోతుంది
0
1
2
@vij72
Prof VJR
2 months
ఒక రాష్ట్రముఖ్యమంత్రి స్థాయిలో ప్రపంచదిగ్గజ ఆటగాడు #మెస్సీ తో కలిసి సరదాగానైనా మైదానంలో ఆటలాడి తన ప్రొఫెషనల్ ఫిట్నెస్ నే కాదు పొలిటికల్ స్టిఫ్నెస్ తో పాటుగా #హైద్రాబాద్_బ్రాండ్ ను కూడా లోకానికి పరిచయం చేయడం ద్వారా ముఖ్యమంత్రి #రేవంత్_రెడ్డి పైచేయి సాధించినట్టే..👏👌💪
0
0
1
@vij72
Prof VJR
2 months
గౌస్ జీ …👌👏✨ నెచ్చెలి వియోగంతో నిశ్శబ్దానుభూతి…. కవితాఝరిగా ప్రవహించిన రసానుభూతి….. మీకే సొంతమైన అలవిలేని అనిర్వచనీయఅనుభూతి….. #కవనమందారం🌺🌸🌼
0
0
2
@vij72
Prof VJR
2 months
నిజంగానే ఆ నాటి ఉత్తరాల్లోని ఆర్ద్రత ఆత్మీయత అక్షరాలను తడుముకుంటూ భావోద్వేగంతో రాసుకున్న,చదువుకున్న క్షణాలు అత్యంత మధురమైన తీపిజ్ఞాపకాలు. ఆ ఉత్తరాలు మనసుల్లోని ఊహలకు రెక్కలుతొడిగి ఎగిరేలా చేసిన…😍💐🌹 #ఉత్తరాలు #మధుసంతకాలు.
@ghouse_hyd
Ghouse
2 months
@Chandu1302 1975. అప్పుడు నాకు 22 ఏళ్ళు. పెళ్ళైన తర్వాత భార్యలు అడపా దడపా పుట్టింట్లకు పోవటాలు సహజం. ఆ రోజుల్లో ఫోన్లు /మెస్సేజీలు లేవు కదా.. ఉత్తరాల ఒరవడి మొదలవ్వటానికి నాంది అక్కడే పడింది. అలా ఉత్తరాలు రాయటం నాకు బాగా వచ్చేసింది. షాపుల్లో కళాత్మక లెటర్ పాడ్ ల కోసం వెతికి వెతికి -
1
0
2
@vij72
Prof VJR
3 months
కుక్కను చంపాల్సివస్తే పిచ్చికుక్కగా ముద్రేసినట్టే ప్రభుత్వరంగసంస్థను ప్రైవేటుపరం చేయడానికి అమ్మేసే ప్రయత్నంలో మరో మెట్టు మూలగనులకేటాయింపు నిర్వహణాసామర్థ్యపెంపు వంటి విషయాలగూర్చి మాట్లాడకుండా కార్మికులను ఆందోళలనవైపు నెట్టడం ద్వారా నష్టాలబాటపట్టించడం… దురదృష్టకరం🤔😡 #VSP #DIPAM
@ghouse_hyd
Ghouse
3 months
VSP పోటాపోటీ గా ఎన్నికలకు ముందు ఓట్ల కోసం వాగ్దానాలు చేస్తారు. ఇవి సహేతుకమా కాదా అనేది అక్కర లేదు. ఓట్లు పిండుకోవటమే పరమావధి. ఇది ఒక రకమైన కరప్షన్. Viable కాని PSU అని తెలిసి మాట ఇవ్వటం ఎందుకు? ఇప్పుడు ఇంకెంత డబ్బు ఇస్తాం అని అంటున్నారు. బాగా అనుభవమున్న పొలిటిషన్ గా psu లలో
0
0
0
@vij72
Prof VJR
3 months
శకునము బల్లి అంటూ అతన్ని ఎగతాళి చేయడం సంగతేమో కానీ అసలు ఇలా ఆటలో అరటిపండులా #ఎన్నికలఆట ను రసవత్తరంగా ఆడి చేయాలనుకున్నపార్టీకి చేయాల్సినమేలు చేసి పక్కపార్టీ పుట్టిముంచడం కూడా అతని వ్యూహంలో భాగమేమో… 🥹🤔 కాస్త విరామంతర్వాత వివరాలు బయటపడతాయేమో…🥹 #బీహార్ఎన్నికలు #PrasanthKishore
@ashuvemulapalli
ASHOK VEMULAPALLI
3 months
అందరికీ శకునం చెప్పే...బల్లి కుడితిలో పడిదంట..ఇప్పుడు.. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) పరిస్థితి ఇదే.. దేశంలో అందర్నీ గెలిపించింది నా వ్యూహాలతోనే అని చెప్పుకున్న వ్యక్తి ఇవాళ బీహార్ లో సొంత పార్టీ పెట్టి ఒక్క సీట్లో కూడా తన వ్యూహాలు అమలు చేసి గెలవలేకపోయాడు.. #BiharElections
0
0
0
@vij72
Prof VJR
3 months
#ఐపోయినపెళ్ళి కి మేళం ఎందుకనేమో🤔😂🤣
0
0
1
@vij72
Prof VJR
3 months
మన లాభనష్టాల సంగతెలా వున్నా #నితీష్ 10 వసారి ముఖ్యమంత్రిగా కుర్చీ ఎక్కవచ్చు. ఆపై కొన్నిరోజులకే లుకలుకలతో ఆయనే లాంతర్ వైపు మొగ్గుచూపి 11 వసారి పదవికోసం పంకజాక్షులకు చెవిలో పువ్వెట్టేయవచ్చు.అప్పుడేమైనా కేంద్రం పెట్రోల్ డీసెల్ పై ఏవో కొన్ని పైసల తగ్గింపు మంత్రం వేయవచ్చు🤔🤔
0
0
2